- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hemanth Soren : హేమంత్ సోరెన్ ఫ్యామిలీకి ‘జై’.. ముగ్గురు మాజీ సీఎంలకు ఊహించని షాక్
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులతో పాటు ఏకంగా నలుగురు మాజీ సీఎంల ఫ్యామిలీ మెంబర్స్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
హేమంత్ సోరెన్, భార్య కల్పనా, సోదరుడు బసంత్..
సీఎం హేమంత్ సొరెన్ దంపతులు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బర్హయిత్ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం హేమంత్ సోరెన్ 39,791 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గాండే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సతీమణి కల్పనా సోరెన్ 17,142 ఓట్ల తేడాతో గెలిచారు. సొరెన్ సోదరుడు, జేఎంఎం అభ్యర్థి బసంత్ సొరెన్ విజయఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి సునీల్ సొరెన్‌పై 14,588 ఓట్ల తేడాతో బసంత్ గెలుపొందారు.
నలుగురు మాజీ సీఎంల కుటుంబ సభ్యులు..
మాజీ సీఎం, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమ దాస్ జంషేడ్ పూర్ (ఈస్ట్) నుంచి బరిలో నిలిచారు. పూర్ణిమ దాస్ గతంలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి అజొయ్ కుమార్‌పై 42,871 ఓట్లతో గెలుపొందారు. ఆమె మామ రఘుబర్ దాస్ 1995 నుంచి 2014 వరకు ఈ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి సీఎంగా కొనసాగారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రఘుబర్ దాస్ బీజేపీ రెబల్ ఎమ్మెల్యే సర్యూ రాయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీ రఘుబర్ దాస్‌ను ఒడిశా గవర్నర్‌గా నియమించింది.
చంపై సోరెన్ కుమారుడు బాబులాల్ సోరెన్
మాజీ సీఎం చంపై సోరెన్ కుమారుడు బాబులాల్ సోరెన్ ఘట్‌శిలా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఇక్కడి నుంచి జార్ఖండ్ మంత్రి, జేఎంఎం అభ్యర్థి రాందాస్ సోరెన్ బరిలో ఉండగా ఆయన చేతిలో బాబులాల్ సోరెన్ ఓడిపోయారు. చంపై సోరెన్ హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి ప్రత్యే జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమంలో కలిసి పనిచేశారు. ఈ ఏడాది బీజేపీలో చేరారు.
మాజీ సీఎం మధు కొడా భార్య గీతా కొడా జగన్నాథ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సోనారామ్ సింకూ 7383 ఓట్లతో గీతా కొడాపై విజయం సాధించారు.
మరో మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా భార్య మీరా పొట్కా నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో జేఎంఎం అభ్యర్థి సంజీబ్ సర్దార్ 18వేల పై చిలుకు ఓట్లతో విజయఢంకా మోగించారు.