రాష్ట్ర చరిత్రలో హెకానీ జఖాలూ సరికొత్త అధ్యాయం.. 60 ఏళ్ల తర్వాత హిస్టరీ క్రియేట్!

by Satheesh |
రాష్ట్ర చరిత్రలో హెకానీ జఖాలూ సరికొత్త అధ్యాయం.. 60 ఏళ్ల తర్వాత హిస్టరీ క్రియేట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. రాష్ట్ర హోదా లభించిన 60 ఏళ్లకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే అడుగుపెట్టబోతోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్ర అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే గెలిచిన సందర్భం లేదు. గురువారం జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీపీపీ అభ్యర్థి హెకానీ జఖాలూ హిస్టారికల్ విక్టరీ నమోదు చేశారు. ఆమె విజయంతో నాగాలాండ్ అసెంబ్లీకి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే తన గళాన్ని వినిపించబోతున్నారు.

కాగా, దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జఖాలూ వృత్తి రీత్యా న్యాయవాది. ఈ ఫలితాల్లో మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే జఖాలూ విజయం ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోగా సల్హౌటుయోనువో మాత్రం ఇంకా ఆధిక్యంలోనే ఉన్నారు. దీంతో విజయం ఖరారు కావడంతో జఖాలూనే ఆ రాష్ట్రానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా పేరు కొట్టేశారు. కాగా, అంతార్జాతీయ మహిళా దినోత్సవానికి ముంగిట్లో ఈ ఫలితం రావడం మహిళల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed