- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీవి లక్షల సూట్లు.. నాది సాధారణ టీ షర్ట్: రాహుల్‌గాంధీ
భోపాల్: ప్రధాని మోడీ రోజూ లక్షల రూపాయల విలువైన సూట్‌లను ధరిస్తుంటే.. తాను మాత్రం ఒక సాధారణమైన టీ షర్టును ధరిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ప్రధానమంత్రి ఒక రోజులో లక్షలు విలువైన దాదాపు 1 నుంచి 2 సూట్లను ధరిస్తుంటారు. మోడీజీ ధరించిన బట్టలనే మళ్లీ ధరించడాన్ని మీరు ఎన్నడైనా చూశారా ? నేను ఈ ఒక్క తెల్లని చొక్కాను ధరిస్తాను’’ అని ఆయన విమర్శించారు.
శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘ప్రధాని మోడీ ఇంతకుముందు ప్రతి ప్రసంగంలో తనను తాను ఓబీసీగా చెప్పుకునేవారు. కులగణన గురించి నేను మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రధాని ప్రసంగాల్లో ఓబీసీ ప్రస్తావన మాయమైంది. ఇప్పుడాయన పేదరికం ఒక్కటే కులమని చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌తో పాటు జాతీయ స్థాయిలో కులగణన నిర్వహిస్తామని రాహుల్ ప్రకటించారు. కులగణన ద్వారా సామాజిక సమీకరణాలను తెలుసుకుంటే, వాటికి అనుగుణంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తేవడం సాధ్యపడుతుందని చెప్పారు.