Vehicle Insurance: వాహనదారులకు బిగ్ షాక్!.. 'చలాన్లను బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం'

by Prasad Jukanti |   ( Updated:2024-09-25 14:02:53.0  )
Vehicle Insurance: వాహనదారులకు బిగ్ షాక్!..  చలాన్లను బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డుపై మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు డ్రైవ్ చేసినా ఇతర వాహనాల రూపంలో ఏక్షణాన ప్రమాదాలు ముంచుకువస్తాయో తెలియడం లేదు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి ఇన్సూరెన్స్ అధికంగా ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తాజాగా ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన లేఖను రాశారు. అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడంతో పాటు ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ అధిక చలాన్లు కలిగి ఉండే వారు ఇకపై తమ వాహనాలకు ఇన్సూరెన్స్ అధిక ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాలని లేఖ ద్వారా కోరారు. ఇటువంటి విధానం ద్వారా డ్రైవర్ల నుండి వచ్చే వాస్తవ రిస్క్‌తో బీమా ఖర్చులను సమం చేయడమే కాకుండా, తరచుగా క్లెయిమ్‌లు చేయడం వల్ల బీమా సంస్థలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకువచ్చినా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. మరి ఈ ప్రతిపాదనపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed