Cong - AAP alliance : కాంగ్రెస్‌తో పొత్తుపై 12లోగా తేల్చుకుంటాం.. లేదంటే ఒంటరి పోటీయే : ఆప్

by Hajipasha |
Cong - AAP alliance : కాంగ్రెస్‌తో పొత్తుపై 12లోగా తేల్చుకుంటాం.. లేదంటే ఒంటరి పోటీయే : ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానాలో కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. అయితే సీట్ల పంపకాలపై ఇరుపార్టీలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదన్నారు. ఒకవేళ పొత్తు కుదరకుంటే ఒంటరి పోరుకే ఆప్ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు.

నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సెప్టెంబరు 12లోగా పొత్తు విషయమై ఆప్ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా తమకు 10 సీట్లను కేటాయించాలని ఆప్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏడు సీట్లతో సర్దుకోవాలని ఆప్‌కు కాంగ్రెస్ సూచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed