NDPS Cases : 15 నెలల్లో 2,400 ‘నార్కోటిక్’ కేసులు

by Hajipasha |
NDPS Cases : 15 నెలల్లో 2,400 ‘నార్కోటిక్’ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. 2023 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకు(15 నెలల్లో) నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీ‌పీఎస్) చట్టం కింద రాష్ట్రంలో 2,405 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 3,562 మందిని అరెస్టు చేశారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 7వ అత్యున్నత స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ వర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల వివరాలతో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో రాష్ట్రంలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద 24 ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. రూ. 9.59 కోట్ల విలువైన ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement

Next Story