- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేప్ ఆరోపణలు చేసిన మహిళపైనే కేసు

- హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్, సింగర్ రాకీ మిట్టల్‌పై ఆరోపణలు
- తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని హిమాచల్‌ప్రదేశ్‌లో కేసు
- మోసం, కుట్ర కోణాలున్నాయని మహిళపై హర్యానా పోలీసుల కేసు నమోదు
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బదోలి, సింగర్ భగవాన్ అలియాస్ రాకీ మిట్టల్‌లు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కేసు పెట్టిన ఢిల్లీ మహిళపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంచకుల లోని సెక్టార్ 5 పోలీస్ స్టేషన్‌లో రాకీ మిట్టల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ మహిళపై భారతీయ న్యాయ్ సంహిత సెక్షన్లు 308(2), 308(5), 351(2), 61 కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో పంచకులకు చెందిన అమిత్ బిందాల్‌తో పాటు మరో మహిళపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జనవరి 21, 22 తేదీల్లో రాకీ మిట్టల్‌కు ఒక మహిళ కాల్ చేసి గ్యాంగ్ రేప్ కేసులో కాంప్రమైజ్‌కి రావడానికి రూ.50 లక్షలు ఇవ్వాలని కోరింది. అయితే రాకీ మిట్టల్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో బ్లాక్ మెయిలింగ్‌కు దిగిందిన రాకీ మిట్టల్ ఆరోపిస్తున్నారు. అమిత్ బిందల్‌తో పాటు మరో మహిళ తనతో పాటు మోహన్ లాల్ బదోలిని హనీ ట్రాప్ కేసులో ఇరికించాలని చూసినట్లు పేర్కొననాడు. పంచకులలో నిర్మాణంలో ఉన్న తన ఇంటికి వచ్చి గలాటా సృష్టించారని ఫిర్యాదులో తెలిపాడు. అయితే అన్ని రకాలుగా మమ్మల్ని ఇరికించాలని ప్రయత్నించి విఫలం కావడంతోనే హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో తప్పుడు కేసు పెట్టినట్లు రాకీ చెబుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫేక్ వీడియోలు సృష్టించి తనను, మోహన్ లాల్ బదోలిని బెదిరిస్తున్నట్లు రాకీ పేర్కన్నాడు. కాగా, 2024 డిసెంబర్ 13న బదోలి, మిట్టల్‌లు తనపై గ్యాంగ్ రేప్ చేసినట్లు కేసు పెట్టింది. మిట్టల్ తన మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం కల్పిస్తానని, బదోలి తనకు ప్రభుత్వం ఉద్యోగం రావడంలో హెల్ప్ చేస్తానని మోసం చేసినట్లు తెలిపింది. 2023 జూలై 3న సోలన్‌లోని ఒక హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కేసు పెట్టింది. అయితే అవన్నీ ఫేక్ ఆరోపణలను పేర్కొంటూ మిట్టల్ ఫిర్యాదు చేయడంతో.. సదరు మహిళపై కేసు నమోదు చేశారు.