Jagdeep Dhankhar: రాజ్యసభ ఛైర్మన్ పై అశ్వాస తీర్మానం

by Shamantha N |
Jagdeep Dhankhar: రాజ్యసభ ఛైర్మన్ పై అశ్వాస తీర్మానం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ(Rajya Sabha) ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Jagdeep Dhankar) కు ఇండియా కూటమి షాక్ ఇచ్చింది. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన విభజన రాజకీయాలు చేస్తూ, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యింది. కాగా.. . ఈ అవిశ్వాస తీర్మాణానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌తో సహా ఇండియా కూటమి నేతలు మద్దతిచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. అయితే, 60 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi), హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్(George Soros) మధ్య ఆర్థిక బంధాలున్నాయన్న ఆరోపణలపై రాజ్యసభలో చర్చ జరిగింది. దీనిపైనే అధికార, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతోనే రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. సభను సజావుగా జరగట్లేదని ఎన్డీయే, ఇండియా కూటమి సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి.

బాధాకర నిర్ణయం- జైరాం రమేష్

మరోవైపు, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. “ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమైన నిర్ణయం. కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవలసి వచ్చింది. ఈ తీర్మానాన్ని ఇప్పుడే రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించాం” అని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. 'అధికార పార్టీ పార్లమెంటును నిర్వహించనివ్వకపోవడం దేశ దురదృష్టం. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారు. సభా కార్యక్రమాలను అధికార పార్టీ అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి' అని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

Next Story