- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బిడ్డ కావాలి.. నా భర్తకు పెరోల్ ఇవ్వండి'.. జైలు అధికారులకు మహిళ అభ్యర్థన
గ్వాలియర్: గత ఏడేళ్లుగా గ్వాలియర్ సెంట్రల్ జైల్లో ఉన్న భర్త కోసం ఓ మహిల పెరోల్‌కు దరఖాస్తు చేసుకుంది. తనకు సంతానం కావాలని.. అందుకే తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని ఆ మహిల ఆ దరఖాస్తులో కోరింది. ఈ మేరకు శివపురికి చెందిన ఓ కుటుంబం గ్లాలియర్ జైలు అధికారులను ఆశ్రయించింది. జైలులో ఉన్న వ్యక్తి పేరు ధారా సింగ్ జతవ్. వివాహం జరిగిన వెంటనే ఓ హత్య కేసుకు సంబంధించి ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేయడంతో తమ కుటుంబం వివాహ వేడుకలను కూడా జరుపుకోలేకపోయిందని ఖైదీ తండ్రి కరీం సింగ్ జతవ్ చెప్పారు.
తమకు మనవడో, మనవరాలో కావాలని తను, అనారోగ్యంతో ఉన్న తన భార్య కోరుకుంటున్నట్టు కరీం సింగ్ వెల్లడించారు. ఇందుకోసం కొద్ది రోజులు తన కొడుకును జైలు నుంచి విడుదల చేయాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ విదిత్ సిర్వయ్య స్పందిస్తూ.. జీవిత కాల శిక్ష అనుభవిస్తున్న వారెవరైనా తోటి ఖైదీలతో, జైలు సిబ్బందితో సత్ర్పవర్తనతో ఉన్నట్టు భావిస్తే.. రెండేళ్ల తర్వాత పెరోల్‌కు అర్హులని చెప్పారు. పెరోల్ మంజూరు చేయాలా వద్దా అనేదానిపై జిల్లా కలెక్టర్‌దే తుది నిర్ణయమన్నారు.