- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ముఖ్య నేత రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడి బీజేపీ గూటికి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీకి, పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు.
రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ నాశనమైందని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని, రాహుల్ సీనియర్లందరినీ పక్కన పెట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ది చిన్నపిల్లల మనస్తత్వం అని, రాజకీయ పరిపక్వత లేదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్‌గా గులాంనబీ ఆజాద్ పనిచేశారు. 2005-2008 వరకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదే విధంగా రాజ్యసభ విపక్షనేతగా, కేంద్రమంత్రిగా గులాంనబీ ఆజాద్ పని చేశారు.
Also Read : కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్.. సీనియర్ నాయకుడు ఎంఏ ఖాన్ పార్టీకి రాజీనామా