గుజరాత్ ని వణికిస్తున్న చాందిపుర వైరస్.. నలుగురు చిన్నారులు మృతి

by Shamantha N |
గుజరాత్ ని వణికిస్తున్న చాందిపుర వైరస్.. నలుగురు చిన్నారులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓవైపు జికా వైరస్.. మరోవైపు అమీబా వైరస్ తో యుద్ధం చేస్తూంటే.. మరో కొత్తరకం వైరస్ ప్రజలను కలవరపెడుతోంది. గుజ‌రాత్‌ ని చాందిపుర వైరస్ గడగడలాడిస్తుండి. స‌బ‌ర్‌కాంతా జిల్లాలో చాందిపుర వైర‌స్ సోకి న‌లుగురు చిన్నారులు చనిపోయారు. మరో ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. హిమ్మత్‌న‌గ‌ర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లలకు ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆరుగురు చిన్నారుల‌కు బ్లడ్ శాంపిల్స్ ని పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపారు. ఆ నమూనాల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు సబర్ కాంత జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు.

చాందిపురా వైరస్

జూలై 10న న‌లుగురు చిన్నారులు చాందిపుర వైర‌స్ సోకి చనిపోయినట్లు హిమ్మత్ నగర్ ఆస్పత్రి వైద్యులు అనుమానం వ్యక్త చేశారు. అయితే ఆ ల‌క్ష‌ణాలే మ‌రో ఇద్ద‌రిలో గ‌మ‌నించిన‌ట్లు చెప్పారు. చాందిపుర వైర‌స్ కేసుల్లో జ్వ‌రం ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఆ వైర‌స్ సోకిన వారికి ఫ్లూ లాంటి ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. అది తీవ్ర స్థాయికి చేరితే మెదడువాపు వస్తుంది. దీంతో చిన్నారులు చనిపోతారు. దోమ‌లు, ఈగలు, పురుగుల ద్వారా ఆ వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. ముందస్తు చర్యల్లో భాగంగా సబర్ కాంత జిల్లా వ్యాప్తంగా అధికారులు శానిటైజేషన్ చర్యలు చేపడుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed