Sanjiv Bhatt : మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ నిర్దోషి.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక తీర్పు

by Hajipasha |
Sanjiv Bhatt : మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ నిర్దోషి.. కస్టోడియల్ టార్చర్ కేసులో  కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : నేరాన్ని ఒప్పుకోవాలంటూ నరన్ జాదవ్ అనే వ్యక్తిని కస్టడీలో టార్చర్ చేశారనే అభియోగాలతో 1997లో నమోదైన కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌(Sanjiv Bhatt)కు ఊరట లభించింది. ఈ అభియోగాలను నిరూపించేందుకు సరిపడా ఆధారాలు లభించలేదు. దీంతో గుజరాత్‌(Gujarat)లోని పోర్‌బందర్‌లో ఉన్న ఓ కోర్టు సంజీవ్ భట్‌‌‌ను నిర్దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.

ఈమేరకు పోర్‌బందర్ కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముకేశ్ పాండ్యా శనివారం రోజు తీర్పును వెలువరించారు. ‘‘సంజీవ్ భట్‌‌పై నమోదైన అభియోగాలను నిరూపించే సరైన, సమగ్రమైన సాక్ష్యాలు లభించలేదు. దీంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రకారం సంజీవ్ భట్‌కు లబ్ధి చేకూరింది. ఆయనను నిర్దోషిగా తేల్చాం’’ అని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసు నమోదైన సమయంలో సంజీవ్ భట్‌.. పోర్‌బందర్‌లో జిల్లా ఎస్పీ హోదాలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed