- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amit Shah : సమన్వయంతో టెర్రర్ నెట్‌వర్క్‌ను కూల్చేయండి
దిశ, నేషనల్ బ్యూరో : దేశ భద్రతకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్న టెర్రర్ నెట్‌వర్క్‌లను కూల్చివేయడానికి భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు, పోలీసులు, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేలా దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు, పోలీసు విభాగాలు, దర్యాప్తు సంస్థల అధిపతులతో జరిగిన హైలెవల్ మీటింగ్‌లో అమిత్‌షా మాట్లాడారు.
దేశ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి బాధ్యత వహిస్తున్న ఇంటెలీజెన్స్ బ్యూరోకు చెందిన మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసీ) పనితీరును ఈసందర్భంగా హోం మంత్రి సమీక్షించారు. దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని సంబంధిత విభాగాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ 24X7 పనిచేసే గొప్ప వ్యవస్థగా ఎంఏసీ కొనసాగాలని అమిత్‌షా ఆకాంక్షించారు. అన్ని భద్రతా విభాగాలు, దర్యాప్తు సంస్థల నుంచి టెక్నికల్‌గా మెరికలుగా ఉండే యువ అధికారులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలన్నారు.