- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GRAP-1: దేశరాజధాని ఢిల్లీలో గ్రాప్- 1 అమలు
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో గాలినాణ్యత తగ్గిపోయింది. గాలి నాణ్యత వరుసగా రెండో రోజు ‘పూర్’ కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPPB) తెలిపిన వివరాల ప్రకారం దసరా తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 224 కు చేరుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఈ ఏడాది కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రాప్-1ని మంగళవారం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రాప్-1 దశలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించడం లాంటివి ఉంటాయి. చలికాలం ప్రారంభానికి ముందే వాయుకాలుష్యం తీవ్రంగా మారింది. దీంతో, ఇప్పటికే టపాసుల వాడకం, అమ్మకం, నిల్వలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి వరకు క్రాకర్స్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రాప్ విధానం ఎప్పుడు అమలు చేస్తారంటే?
ఇకపోతే, ఏదైనా సిటీలో ఏక్యూఐ 200 దాటినప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గాలి నాణ్యత క్షీణతను నిరోధించడానికి అమలు చేసే విధానం. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత ఆధారంగా గ్రాప్ విధానాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కలిగించే పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటారు. రెండవ దశలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సేవలను ప్రోత్సహిస్తారు. మూడవ దశలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్‌లలో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఫోర్-వీలర్లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 ఫోర్-వీలర్ల వినియోగాన్ని నిషేధించనున్నారు. నాల్గవ దశలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధిస్తారు. పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తారు.