- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DeepFake : డీప్‌ఫేక్‌ల కట్టడికి కొత్త చట్టం
న్యూఢిల్లీ: ఇటీవల సోషల్ మీడియాలో పెరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలకు సంబంధించి కఠిన చర్యల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారాన్ని నిలువరించేందుకు కొత్త చట్టాన్ని కూడా తెచ్చే అంశాన్ని పరిగణిస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో అన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 23,24 తేదీల్లో సొషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ కారణంగా పుట్టుకొస్తున్న నకిలీ సమాచారం నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు అవసరమని భావిస్తున్నట్టు, అవసరమైతే దానికోసం కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడుతున్న వారికి డీప్‌ఫేక్, నకిలీ సమాచారం అత్యంత ప్రమాదకారిగా ఉంది. ఏఐ ఎంతో ఉపయోగపడే టెక్నాలజీ అయినప్పటికీ, హాని కలిగించడానికి, సమాజంలో గందరగోళం సృష్టించడానికి, హింసను ప్రేరేపించడానికి వాడుతున్నారు. ఇప్పటికే 2023 ఏప్రిల్‌లో ఐటీ నిబంధనలను రూపొందించాము. డీప్‌ఫేక్‌లు, నకిలీ సమాచార ముప్పు లేకుండా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని, అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు.
- Tags
- deepfake videos