PM Modi: 'అమృత్ కాల్'లో ఇది మైలురాయి బడ్జెట్‌: ప్రధాని మోడీ

by S Gopi |
PM Modi: అమృత్ కాల్లో ఇది మైలురాయి బడ్జెట్‌: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలకు వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా నేడు ప్రవేశపెట్టనున్న 2024-25 కేంద్ర బడ్జెట్‌ను 'అమృత్ కాల్'లో 'మైలురాయి బడ్జెట్'గా అభివర్ణించారు. 'ఈ బడ్జెట్ ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చే ఐదేళ్ల పాటు దిశానిర్దేశం చేయనుంది. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి 'వికసిత్ భారత్' కలను సాకారం చేసేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది అవుతుందని' మోడీ తెలిపారు. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, గత మూడేళ్లలో సగటున 8 శాతం వృద్ధిని సాధించింది. సానుకూల దృక్పథం, మెరుగైన పెట్టుబడులు, ఆర్థికవ్యవస్థ పనితీరు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇది భారత అభివృద్ధి ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని మోడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story