Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..

by Prasanna |
Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..
X

దిశ, వెబ్ డెస్క్: గత పది రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలో ఊర్లన్నీ జలమయ్యాయి. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే స్ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగల సమయంలో ఎవరి ఇళ్ళకు వారు వెళ్తుంటారు. ఈ టైం లో ఎక్కువగా రైళ్ళలో ప్రయాణిస్తుంటారు.

తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగలకు ప్రతీయేటా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగల సందర్భంగా 24 ప్రత్యేక రైళ్లను తీసుకురానుంది. దసరా, దీపావళి వెళ్లే వారిని రద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైల్వే లను తీసుకురానుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటిని అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు నడిపించనట్లు ఉంది.

సికింద్రాబాద్ – తిరుపతి రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 9 వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.

తిరుపతి – సికింద్రాబాద్ రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

తిరుపతి – శ్రీకాకుళం రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది.

శ్రీకాకుళం – తిరుపతి రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Next Story