మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ లో లిక్కర్ హోం డెలివరీ!

by Prasad Jukanti |   ( Updated:2024-07-16 06:54:02.0  )
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ లో లిక్కర్ హోం డెలివరీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మందుబాబులుకు గుడ్ న్యూస్.. లిక్కర్ కోసం ఇకపై పబ్బులు, వైన్స్ లు, బార్లకు వెళ్లాల్సిన పని లేదు. ఆన్ లైన్ లో ఫుడ్, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటే వాటిని ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నట్లుగా త్వరలోనే లిక్కర్ ను సైతం హోమ్ డెలివరీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వలోనే లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారీ దారులు యోచిస్తున్నారు. ఈ తరహా మద్యం హోమ్ డెలివరీ చేసే విధానం ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్ లో అమల్లో ఉండగా త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హరియాణా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా బీర్, వైన్ వంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయవచ్చని పేర్కొన్నది. ఈ విధానం ద్వారా లాభనష్టాలను అంచనా వేసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతున్నది.

కాగా కోవిడ్ -19 సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ గఢ్, అస్సాంలో తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. ప్రస్తుతం ఈ విధానం అమలులో ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఆన్ లైన్ డెలివరీల ద్వారా అమ్మకాలు 20-30 శాతం పెరిగినట్లు రిటైల్ పరిశ్రలమ అధికారులు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది. కాగా అయితే గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 100 శాతం మంది హైదరాబాదీలు మద్యం హోండెలివరీ సేవలు ప్రారంభించాలని కోరినట్లు వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed