విమాన టాయిలెట్‌లో భారీగా బంగారం స్వాధీనం..

by Vinod kumar |
విమాన టాయిలెట్‌లో భారీగా బంగారం స్వాధీనం..
X

న్యూఢిల్లీ:విమాన టాయిలెట్‌లో పెద్ద ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఆదివారం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో రూ.2 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. వాష్ రూంలోని సింక్ కింద భాగంలో ఒక చిన్న బ్యాగ్ లో దీనిని గుర్తించినట్లు తెలిపారు. మొత్తం బంగారం 3.96 కేజీలు ఉందన్నారు. అయితే ఇది ఎవరు తీసుకొచ్చారనే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Next Story