Jagdeep Dhankhar : విదేశాలకు వెళ్లాలనే మోజు కొత్త రోగంలా పట్టుకుంది : ఉప రాష్ట్రపతి

by Hajipasha |
Jagdeep Dhankhar : విదేశాలకు వెళ్లాలనే మోజు కొత్త రోగంలా పట్టుకుంది : ఉప రాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో : విదేశాలకు వెళ్లాలనే మోజు ఈతరం విద్యార్థులను కొత్త రోగంలా పట్టుకుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మండిపడ్డారు. భారత విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తుండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంతో పాటు మేధస్సు కలిగిన మానవ వనరులను కోల్పోతున్నామన్నారు. ‘‘విద్యను వ్యాపారంగా మార్చడం వల్ల దాని నాణ్యత తగ్గిపోతోంది. దేశ భవిష్యత్తుకు అది ఏమాత్రం మంచిది కాదు’’ అని ఉప రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఉన్న ఓ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో జగదీప్ ధన్‌ఖర్ ప్రసంగించారు.

‘‘ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు భారత విద్యార్థులు అమితాసక్తి చూపిస్తున్నారు. అయితే విదేశాల్లో తాము చేరబోయే విద్యాసంస్థ గురించి కనీస సమాచారాన్ని తెలుసుకోవడం లేదు’’ అని ఆయన చెప్పారు. ‘‘ఈ ఏడాది ఇప్పటివరకు 13 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఫలితంగా రూ.50వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోయాం. ఆ విద్యార్థులంతా ఇక్కడే చదువుకొని ఉంటే దేశానికి, వారికి చాలా రకాల ప్రయోజనం చేకూరి ఉండేది’’ అని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed