BJP: హిండెన్‌బర్గ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం

by S Gopi |   ( Updated:2024-08-12 16:24:13.0  )
BJP: హిండెన్‌బర్గ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం
X

దిశ, నేషనల్ బ్యూరో: హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంలో రాజకీయ దుమారం పెరుగుతోంది. తాజాగా భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బీజేపీ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌లో అమెరికాకు చెందిన పెట్టుబడిదారుడు జార్జ్ సొరోస్ ప్రధాన ఇన్వెస్టర్ అని సోమవారం బీజేపీ ఆరోపణలు చేసింది. 'హిండెన్‌బర్గ్ ఆరోపణల విషయంలో అనేక సందేహాలున్నాయి. హిండెన్‌బర్గ్‌లో ఎవరి పెట్టుబడులు ఉన్నాయి? భారత్‌పై నిత్యం దుష్ప్రచారం చేసే జార్జ్ సొరోస్ ఆ కంపెనీలో ప్రధాన ఇన్వెస్టర్‌గా ఉన్నారు. హిండెన్‌బర్గ్‌పై చర్యలు తీసుకుంటాం. స్టాక్ మార్కెట్లు సజావుగా సాగేలా చూడటం సెబీ బాధ్యత. ఇదే సమయంలో నరేంద్ర మోడీపై ఉన్న ద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ నేడు మొత్తం భారత్‌పై చూపిస్తోందని' బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఏఎన్ఐతో అన్నారు. కాంగ్రెస్ భారత స్టాక్ మార్కెట్ మొత్తాన్ని క్రాష్ చేయాలని, చిన్న పెట్టుబడిదారులను నష్టాలపాలు చేయడం, భారత్‌లో పెట్టుబడులు రాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు చేశారు.

Advertisement

Next Story