గాజాపై మరోసారి విరుచుకు పడ్డ ఇజ్రాయెల్.. 90 మంది మృతి

by Shamantha N |
గాజాపై మరోసారి విరుచుకు పడ్డ ఇజ్రాయెల్.. 90 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దక్షిణ గాజా స్ట్రిప్ లో హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డీఫ్ లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడిలో చిన్నారులు 90 మంది చనిపోయారని గాజా అధికారులు తెలిపారు. కనీసం, 300 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. దాడి జరిగిన ప్రాంతంలో తమసైనిక కమాండర్ ఉన్నారని ఇజ్రాయెల్ చేసిన వాదనను హమాస్ తోసిపుచ్చింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ దాడిలో మిలిటరీ చీఫ్ డీఫ్, హమాస్ రెండవ కమాండర్ రఫా సలామా మరణించారా లేదా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఇకపోతే, వేలాది మంది పాలస్తీనియన్లు సురక్షితంగా ఉన్నారని సైన్యం ప్రకటించిన ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన దాడి.. ప్రధాన కుట్రదారుడు అని అధికారులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఆ దాడిలో సుమారు 1,200 మంది మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్ వాంటెడ్ లిస్ట్‌లో డీఫ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed