- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామాన్యులపై గుది 'బండ'.. వాటి ధరలు భారీగా పెంపు
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు డబుల్ షాక్ తగిలింది. ఒకవైపు వంటగ్యాస్ సిలిండర్ ధరలతో పాటు మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. రూ.50 పెంపుతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1002కి చేరుకోగా.. ఏపీలో రూ.1008కి చేరుకుంది.
అటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ రూ.95.49గా ఉంది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ పై 88 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.80గా ఉండగా.. డీజిల్ రూ.96.83గా ఉంది. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.