కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు

by Prasanna |
కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన నడుమ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసుల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని రాజధాని వాసులకు చెప్పారు. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ సన్నద్ధమవుతుందని చెప్పారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో 7,986 బెడ్లు సిద్ధం చేశారని, సరిపోయేంత ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ 48శాతం ఉన్నట్లు కేజ్రివాల్ చెప్పారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆందోళన అవసరం లేదని చెప్పారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వమిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని కేజ్రివాల్ ఆదేశించారు.

ఈ ఏడాదితో అత్యధికం

దేశంలో వరుసగా రెండో రోజు 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 3,095 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఒక్కరోజులో వెలుగుచూసిన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా కేసులతో కలుపుకుని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో గోవా, గుజరాత్‌లో రాష్ట్రాల్లో ఇద్దరు మరణించినట్లు పేర్కొంది.

Advertisement

Next Story