మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన సోనియా, రాహుల్, ఖర్గే, మోడీ

by Harish |   ( Updated:2024-05-21 10:33:07.0  )
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన సోనియా, రాహుల్, ఖర్గే, మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో:మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్థంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్‌భూమిలో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ నివాళులర్పించారు. అలాగే ప్రధాని మోడీ ‘మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి నా నివాళులు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తన దివంగత తండ్రి, మాజీ ప్రధానిని స్మరించుకుంటూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. దానిలో రాహుల్ తన తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను కూడా పంచుకున్నారు, అందులో రాజీవ్ గాంధీ రాహుల్ భుజాలపై చేయి వేసుకుని కనిపిస్తారు. ఆ పోస్ట్‌లో, "నాన్న, మీ కలలు, నా కలలు, మీ ఆకాంక్షలు, నా బాధ్యతలు. మీ జ్ఞాపకాలు, ఈ రోజు, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటాయి" అని రాహుల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read More..

మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభిజిత్‌ గంగోపాధ్యాయపై ఈసీ కొరడా


ఇంకా, పి చిదంబరం, సచిన్ పైలట్ వంటి ఇతర కాంగ్రెస్ నేతలు కూడా దేశ రాజధానిలో మాజీ ప్రధానికి నివాళులర్పించారు. 1984లో తన తల్లి, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. ఆయన అక్టోబర్ 1984లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 40 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా నిలిచారు. రాజీవ్ గాంధీ మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) ఆత్మాహుతి దాడిలో మరణించారు.

Advertisement

Next Story

Most Viewed