- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
OTT Platforms: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం హెచ్చరిక

దిశ, నేషనల్ బ్యూరో: హద్దులు దాటుతున్న సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్(ఐజీఎల్) అనే కార్యక్రమంలో ప్రముఖ యూట్యూబర్ రన్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం కీలక ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ చట్టం(2021)లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించ వద్దని తీవ్రంగా హెచ్చరించింది. తమ కంటెంట్ వయస్సు-ఆధారంగా వర్గీకరించాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నియమాలు-2021కి అనుగుణంగా ఉండాలని సూచించింది. ఆన్‌లైన్ కంటెంట్ పబ్లిషర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల స్వీయ-నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఉన్న చట్టాలు, నైతిక మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని వివరించింది. ప్రధానంగా.. చట్టం నిషేధించిన ఏ కంటెంట్ అయినా సరే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రసారం చేయకూడదని, వయస్సు ఆధారంగా కంటెంట్‌ను వర్గీకరించాలి, ఏ- రేటెడ్ కంటెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయొద్దని, స్వీయ నియంత్రణ కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పోడ్‌కాస్టర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన రణ్‌వీర్ అల్హాబాదియా తల్లిదండ్రుల, శృంగారం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే.