నదిలో మునిగిన యుద్ధ ట్యాంకర్.. ఐదుగురు భారత సైనికులు మృతి

by Prasad Jukanti |
నదిలో మునిగిన యుద్ధ ట్యాంకర్.. ఐదుగురు భారత సైనికులు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది. సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండగా ఓ యుద్ధ ట్యాంక్ నదిలో మునిగిపోియంది. ఈ ఘటనలో ఒక జూనియర్​ కమిషన్డ్​ అధికారి(జేసీఓ)తో సహా ఐదుగురు సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాతంలో జరిగినట్లు సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్ లోని దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలోని మందిర్​ మోర్హ్​ వద్ద టి-72 ట్యాంక్‌ లో సైనికులు నదిని దాటుతుండగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. నీటి ఉధృతికి ట్యాంక్ మునిగిపోగా అందులోని జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed