- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra: ఆరు నెలల్లో అంతా తారుమారు.. పుంజుకున్న మహాయుతి.. ఎంవీఏ ఓవర్ కాన్ఫిడెన్స్
దిశ, నేషనల్ బ్యూరో: సరిగ్గా ఆరు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లలో బొక్కబోర్లా పడిన మహాయుతి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి(Mahayuti Alliance)... అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం అపూర్వ విజయాన్ని సాధించింది. 48 పార్లమెంట్ సీట్లలో 30 సీట్లు గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న మహావికాస్ అఘాఢీ(Maha Vikas Aghadi Alliance) ఇప్పుడు చావు తప్పి కన్ను లోట్టబోయిన పరిస్థితుల్లో పడింది. బట్ ఇదెలా జరిగింది? ఈ ఆరు నెలల కాలంలో మహారాష్ట్రలో ఏం జరిగింది? మహాయుతి చేసిన మ్యాజిక్ ఏంటి?
మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్
లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఓడిన వెంటనే మహాయుతి సర్కార్.. లడ్కీ బహిన్ యోజన(Ladki Bahin Yojana) పథకాన్ని తెచ్చి ప్రతి మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఖాతాల్లో జమచేసింది. ఈ నాలుగు నెలల్లో దాదాపు 1.85 కోట్ల మంది మహిళల ఖాతాల్లో కచ్చితంగా వేసింది. రాష్ట్రంలోని మొత్తం 4.6 కోట్ల మంది మహిళల్లో 40 శాతం మందికి పైగా ఈ స్కీమ్ ద్వారా డైరెక్ట్‌గా లాభం పొందుతున్నారు. విమెన్ ఓటర్స్ మహాయుతి వైపు ఎట్రాక్ట్ కావడానికి ఇది ప్రధాన కారణం. ఈ ఎన్నికల్లో గెలిస్తే రూ. 1500 కాస్తా రూ. 2100కు పెంచుతామి సీఎం షిండే చేసిన హామీ ఆకర్షించింది.
రైతుల్ని తమ వైపు తిప్పుకోవడం:
రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి పత్తి పంటను మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ కంటే ఎక్కువకు కొంటామని షిండే ప్రభుత్వం ప్రకటించింది. సోయాబీన్స్‌ను ప్రైజ్ సపోర్ట్ స్కీం కిందకి తీసుకొచ్చి 15 శాతం తేమ ఉన్నా కొంటామంది. ఫుల్‌ఫ్లెడ్జ్‌గా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఫలితంగా రైతులు ఎక్కువగా ఉండే విదర్భ ఏరియాలో మహాయుతి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.
ఓబీసీ ఓట్‌బ్యాంక్ పట్టేడయంలో సక్సెస్:
సామాజిక న్యాయం, ఓబీసీలకు న్యాయం, కుల గణన వంటి ప్రకటనలతో కాంగ్రెస్ హోరెత్తించినా ఏక్ హైతో సేఫ్ హై, బాటేంగేతో కటేంగే వంటి నినాదాలతో మరాఠాలు, ఓబీసీల ఓట్లను దూరం కాకుండా బీజేపీ విజయవంతంగా అడ్డుకోగలిగింది. మరాఠా భాషకు అక్టోబర్ మాసంలో జాతీయ హోదా కల్పించి వారిని కొంతమేరకు తనవైపు మళ్లించుకుంది. 90ల నుంచే ఇక్కడ మాలి, ధంగర్, వంజరి వంటి అనేక ఓబీసీ కమ్యూనిటీల్లో బీజేపీ ప్రాబల్యం ఎక్కువ. కుల గణన నెరేటివ్‌ను ట్యాకిల్ చేయడానికి బీజేపీకి ఇది కలిసొచ్చింది.
నిరుద్యోగులకూ వరాలు:
ఫాక్స్‌కాన్-వేదాంత సెమీకండక్టర్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు వెళ్లిపోవడం, పూణేలోని అనేక కంపెనీలు గుజరాత్‌కు తమ బేస్ షిఫ్ట్ చేసుకోవడంతో మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తి చూపిన నేపథ్యంలో తప్పును సరిదిద్దుకున్న కూటమి.. ఏకంగా ముంబయిని 300 బిలియన్ డాలర్లు (రూ. 3వేల కోట్లు) మెట్రోపాలిటన్ రీజన్‌గా మార్చేలా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కి చెందిన క్లాస్ స్క్వాబ్ ఫోరమ్‌ను ముంబయిలో ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ముంబయిని జాతీయస్థాయిలో కాదుకదా.. ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ సిటీగా మారుస్తుందని మహాయుతి చెప్పింది.
ఎంవీఏ ఎందుకు ఓడింది?
మహావికాస్ అఘాడీలోని మూడు పార్టీలు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్) కలిసి పోటీ చేసినా, ఉమ్మడిగా అధికారపక్షంపై దాడి చేయడానికి ఎలాంటి నెరేటివ్ తీసుకోలేదు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలిసేలా క్యాంపెయినింగ్స్ చేయలేకపోవడం వంటివి పెద్ద మైనస్‌లుగా ఉన్నాయి. ద్రోహం అనే కోణంలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పార్టీలు ప్రచారం చేశారు గానీ, ఈ క్రమంలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీని సమర్థవంతంగా ఢీకొనడంపై ఫోకస్ పెట్టలేదు. ఇక కాంగ్రెస్‌కు బలమైన స్ట్రాటజీ లేదు. ప్రచారమంతా ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంగా జరిగింది. నేరుగా బీజేపీని ఢీకొట్టలేకపోయింది.