- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఇంటి బయట కాల్పులు: ఇద్దరు నిందితుల అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని భుజ్ లో సోమవారం అర్ధరాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితులను బిహార్‌కు చెందిన విక్కీ సాహెబ్ గుప్తా, సాగర్ శ్రీజోగేంద్ర పాల్‌గా గుర్తించారు. కాల్పుల అనంతరం వీరు ముంబై నుంచి గుజరాత్‌కు పారిపోయినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ మంగళవారం ముంబైకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 14న తెల్లవారుజామున 5గంటల సమయంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసముండే గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించాడు. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకుంది.
కాగా, 2022 నవంబర్ నుంచి గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి సల్మాన్ ఖాన్‌కు పలు మార్లు బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో సల్మాన్ భద్రతను వై ప్లస్‌కి పెంచారు. అదనపు రక్షణ కోసం కొత్త సాయుధ వాహనాన్ని సైతం సల్మాన్ కొనుగోలు చేశారు. తాజా ఘటన తర్వాత సల్మాన్‌ఖాన్‌కు మరింత మంది సిబ్బందిని కేటాయించారు. తన ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముంబై పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని కోరారు.