Turkey Fire Accident : తుర్కియేలో ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి

by M.Rajitha |   ( Updated:21 Jan 2025 2:26 PM  )
Turkey Fire Accident : తుర్కియేలో ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : తుర్కియే(Turkey)లో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. బోలు ప్రావిన్స్ లోని ఓ స్కీ రిసార్ట్ హోటల్(Ski Resort Hotel) లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోగా.. 51 మంది చావు బతుకుల మధ్య వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర మంచు కారణంగా ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకోవడం ఆలస్యం అయిందని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కాగా ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కిటికీలలో నుంచి కిందకి దూకారు. ప్రమాద సమయంలో 234 మంది హోటల్ లో గెస్టులున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని బోలు ప్రావిన్స్ మంత్రి అలీ మీడియాకు వెల్లడించారు.

Next Story

Most Viewed