Bangladesh: నోబెల్ శాంతి గ్రహీత నడుపుతున్న ప్రభుత్వంలోనే శాంతి లేదు- బంగ్లాదేశ్ పై ఆర్ఎస్ఎస్ విమర్శలు

by Shamantha N |
Bangladesh: నోబెల్ శాంతి గ్రహీత నడుపుతున్న ప్రభుత్వంలోనే శాంతి లేదు- బంగ్లాదేశ్ పై ఆర్ఎస్ఎస్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి ఆర్ఎస్ఎస్ (RSS) నేత సునీల్ అంబేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన సకల హిందూ సమాజ్‌ సభలో ఆయన బంగ్లాదేశ్ హింస(Bangladesh violence) గురించి మాట్లాడారు. కేవలం సంప్రదింపులతోనే సమస్య పరిష్కార కాదని అన్నారు. ‘కేంద్రం గట్టిగా ప్రయత్నించి కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. చర్చలతో సమస్యను పరిష్కరించవచ్చని భావిస్తున్నా. అలా కుదరకపోతే మరో పరిష్కారాన్ని వెతకండి. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహ్మద్ యూనస్( Bangladesh's interim leader Muhammad Yunus) నడుపుతున్న ప్రభుత్వంలోనే శాంతి లేదు’ అని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో హిందూ సమాజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా హింస సృష్టిస్తున్నట్లు ఆరోపించారు.

దౌర్జన్యాలను సహించబోం

హింసాత్మక ఘటనలను ఖండించడం వల్ల పని జరగదని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ చెప్పారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించబోమన్నారు. ఇప్పుడు, ఎలాంటి ప్రయత్నం చేయకపోతే, భావి తరాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ లో దేవాలయాలను తగులబెడుతున్నారు.. హిందూ మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ జరిగే హింసకు ప్రతి హిందువు ఆగ్రహానికి లోనవాలని అన్నారు. అక్కడ ఇబ్బందులను సృష్టించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. అలాగే, ఇతర దేశాలలో హిందూ వ్యతిరేక హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని సునీల్ అంబేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు

Advertisement

Next Story