- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తాపడి ఐదుగురు దుర్మరణం
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ జలౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి మధుఘర్ సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని ఓరై మెడికల్ కాలేజీకి తరలించారు. జలౌన్ జిల్లా మడైల గ్రామం నుంచి పెళ్లి బృందం దూతవలి గ్రామానికి బస్సులో వెళ్లింది. అక్కడ వివాహాది కార్యక్రమాలు ముగించుకుని మడైల గ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యానాథ్ ఆకాంక్షించారు.