- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశ్చిమాసియాలో సుస్థిరతకు భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం: ఇజ్రాయెల్ రాయబారి
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ బలంగా, స్థిరంగా ఉందని, అవసరమైతే ఇటీవల తమ దేశంపై జరిగిన దాడి విషయంలో ఇరాన్‌ను ఎదుర్కొనే సత్తా ఉందని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ చెప్పారు. సోమవారం ఆయన ఢిల్లీలో పీటీఐ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. యూఎస్, మరికొన్ని దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు 99 శాతం దాడులను అడ్డుకుంది. నెవాటిమ్ ఎయిర్ బేస్‌లో మాత్రమే కొంత నష్టం సంభవించిందన్నారు. ఇదే సమయంలో పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు గిలోన్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎంతో గౌరవం కలిగిన భారత్ ఈ ప్రతికూల పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తన పలుకుబడిని ఉపయోగించాలని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ తీరును మార్చుకునేందుకు అవసరమైన పద్దతిలో ఇతర దేశాలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నామని గిలోన్ వెల్లడించారు. భారత్‌కు పశ్చిమాసియా ప్రాంతం కూడా ముఖ్యమని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌లలో అనేక వ్యాపార సంబంధాలను భారత్ కలిగి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులను నిలువరించే విషయంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందని నౌర్ గిలోన్ వెల్లడించారు. కాగా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి కారణంగా పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమైన నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య పెరుగుతున్న శతృత్వంపై తాము ఆందోళన చెందుతున్నామని, హింసను తక్షణం నిలిపివేసే ప్రయత్నం చేయాలని భారత్ సైతం అభిప్రాయపడింది.