- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bulldozer Justice: అధికారులు న్యాయవ్యవస్థను భర్తీ చేయలేరు.. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
దిశ, నేషనల్ బ్యూరో: బుల్డోజర్ చర్యలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని చెప్పలేరని వ్యాఖ్యానించింది. అధికారులు న్యాయవ్యవస్థను భర్తీ చేయలేరని తెలిపింది. వారే జడ్జిలా వ్యవహరించి నిందితు స్థిరాస్తులను కూల్చివేయడం తగదని తెలిపింది. ఏకపక్షంగా బుల్డోజర్ కూల్చివేతలు తగవని హితవు పలికింది. రాష్ట్రాలు, అక్కడ పనిచేసే అధికారులు మితమీరి చర్యలు తీసుకోవద్దని సూచించింది. రాష్ట్రంలో నిందితుల ఇళ్లను బుల్డజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని తెలిపింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచే వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది.
బుల్డోజర్ చర్యలు
దేశవ్యాప్తంగా కొద్దికాలంగా ‘బుల్డోజర్’ చర్యలు హాట్ టాపిక్‌గా మారింది. ఇది రాజకీయాల్లో కీలక అంశం అయ్యింది. బుల్డోజర్ న్యాయం పేరుతో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రక్రియ స్టార్ట్ కాగా.. అది ఇతర రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే పలు మార్లు సుప్రీం కోర్టు(Supreme Court) తప్పుబట్టింది. నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేసింది.