- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ జోడో న్యాయ్ యాత్రపై ఉత్కంఠ!: పర్మిషన్ ఇవ్వని మణిపూర్ ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 14నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న బారత్ జోడో న్యాయ్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంకా యాత్రకు పర్మిషన్ ఇవ్వనట్టు తెలుస్తోంది. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరేలో ఇటీవల రాష్ట్ర పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం సైతం భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాలా వద్దా అని మణిపూర్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే భద్రతా సంస్థల నివేదికలు పరిశీలించిన తర్వాతే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉందని వెల్లడించారు. ‘రాహుల్ గాంధీ ర్యాలీకి అనుమతి మంజూరుకు సంబంధించిన అంశం పరిశీలనలో ఉంది. సెక్యురిటీ ఏజెన్సీల నివేదికలను సమీక్షిస్తున్నాం’ అని చెప్పారు.
ప్రభుత్వం అడ్డుంకులు సృష్టిస్తోంది: కాంగ్రెస్
భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. యాత్రకు రాజకీయాలకు సంబంధం లేదని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ..‘మణిపూర్ కాంగ్రెస్ శాఖ యాత్రకు అనుమతి కోరుతూ వారం రోజుల క్రితమే ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసింది. కానీ వారు పర్మిషనల్ ఇవ్వలేరని చెబుతున్నారు. రాజకీయ పార్టీ కార్యక్రమానికి ఆమోదం తెలపడం ప్రభుత్వ విధి’ అని తెలిపారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్ర జవవరి 14న మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.