రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండె!

by sudharani |   ( Updated:2023-10-25 08:30:14.0  )
రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండె!
X

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రాజకీయల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. డెబ్బైయవ దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన 83 ఏళ్ల సుశీల్ కుమార్ షిండె తన కుమార్తె ప్రణితి షిండే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వారసురాలిగా షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించిన సుశీల్ కుమార్ షిండె, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులను చేపట్టారు.

1974-1992 మధ్య మహారాష్ట్ర శాసనసభలో ఉన్నారు. 1992-1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2003లో మొదటిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 వరకే ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం 2006-2012 మధ్య కేంద్ర ఇంధన శాఖా మంత్రిగా, 2012లో హోంమంత్రిగా చేశారు. ఇక, ఆయన వారసురాలిగా లోక్‌సభ బరిలోకి దిగుతున్న కుమార్తె ప్రణితి షిండె చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యం ఉంది. షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలిగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed