సీఏఏపై మమతా చెప్పేవన్నీ అబద్దాలే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు

by samatah |
సీఏఏపై మమతా చెప్పేవన్నీ అబద్దాలే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో మమతా బెనర్జీ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించారు. సీఏఏతో మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మంగళవారం రాష్ట్రంలోని బాంగావ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని, ఎందుకంటే ఈ అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. చొరబాటు దారులను తృణమూల్ కాంగ్రెస్ అక్రమంగా పౌరులుగా మారుస్తోందని చెప్పారు. అక్రమ వలసలను ఆపేందుకు బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని 18 లోక్ సభ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పోలింగ్ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed