ఈడీ చీఫ్ పదవీ కాలం పొడగింపు

by Javid Pasha |
ఈడీ చీఫ్ పదవీ కాలం పొడగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించింది. సెప్టెంబర్ 15 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ ప్రయోజనాల కోసం ఆయన పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సంజయ్ కుమార్ మిశ్రా లేకుండా ప్రస్తుతం జరుగుతున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) సమీక్షలో ప్రతికూల ప్రభావం ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో బుధవారం కేసు విచారణకు చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయన పదవీ కాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాగా సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడగించడం ఇది మూడోసారి.

Advertisement

Next Story