- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Encounter: భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం రాత్రి భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 3 ఆటోమేటిక్ ఆయుధాలతో సహా ఆయుధాలు ఒక AK47, ఒక కార్బైన్, ఒక INSAS, మావోయిస్టుల సాహిత్యం, వస్తువులు కూడా కాల్పుల స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెరిమిలి దళం సభ్యులు కొందరు భామ్రగడ్ తాలూకాలోని కాట్రంగట్ట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో (టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్) టీసీఓసీలో భాగంగా విధ్వంసక కార్యకలాపాలు నిర్వహించే లక్ష్యంతో ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. సమాచారం ఆధారంగా గడ్చిరోలిలోని యాంటీ మావోయిస్ట్ సీ-60 స్క్వాడ్‌లోని రెండు యూనిట్లను వెంటనే ఆ ప్రాంతంలో వెతికేందుకు రంగంలోకి దిగింది.
సెర్చ్ అపరేషన్ కొనసాగుతుండగా.. మావోయిస్టులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపారు. అనంతరం సీ-60 బృందం కూడా ఫైర్ ఓపెన్ చేసి వారిపై కాల్పులు జరిపింది. ముప్పును పసిగట్టిన మావోయిస్టులు వెంటనే దట్టమైన అడవిలోకి పారిపోయారు. కాల్పులు ముగిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీంచగా ముగ్గురు మావోయిస్టులు అక్కడ పడి ఉన్నాయి. అందులో ఇద్దరు మహిళా మావోయిస్టుల కూడా ఉన్నాయి. వారిని వాసు సమర్ కోర్చా (పెరిమిలి దళం కమాండర్), రేష్మా మడ్కం (25), కమల మాదవి (24)గా గుర్తించారు. ఆ ముగ్గురు కూడా హత్యలు, ఎన్‌కౌంటర్లు, దోపిడీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారిపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.22 లక్షల రివార్డును ప్రకటించింది పేర్కొన్నారు.