- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మాకు మరో చాయిస్ ఉండదు.. మోడీతో భేటీ అనంతరం ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏ దేశంలో అయినా స్థానిక ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా పని చేయడం తప్ప మరో మార్గం ఉండదన్నారు. భారత్ లో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ట్విట్టర్ కంటెంట్ విషయంలో తమకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందని తాము చెప్పినట్లుగా నడుచుకోకుంటే భారత్ లో ట్విట్టర్ ను బ్యాన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిందంటూ ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలపై తాజాగా ఎలాన్ మస్క్ స్పందించారు. 'ట్విట్టర్ కు ఎలాంటి చాయిస్ ఉండదు.
స్థానిక ప్రభుత్వాల ఆదేశాలను పాటించాల్సిందే. అంతకు మించి మనం ఏమీ చేయలేం. వాటిని అమలు చేయకుంటే మూసివేసుకోవడం ఖాయం' అని వ్యాఖ్యానించారు. మోడీతో మీటింగ్ సందర్భంగా టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉందని చెప్పారు. వచ్చే ఏడాది తాను భారత్ లో ప్రకటించబోతున్నట్లు తెలిపారు. తాను మోడీకి అభిమానినని, భారత్‌లో పెట్టుబడుల విషయంలో మోడీ కృషి అద్భుతంగా ఉందని ప్రశంసించారు. భారత్ అభివృద్ధి విషయంలో మోడీకి ప్రత్యేక దృష్టి ఉందన్నారు.