Supreme Court: ఉద్యోగాల భర్తీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అభ్యర్థులకు ఇక పండగే

by Prasad Jukanti |   ( Updated:2024-11-07 08:07:37.0  )
Supreme Court: ఉద్యోగాల భర్తీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అభ్యర్థులకు ఇక పండగే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ (Govt Jobs Recruitment) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ మధ్యలో ఉండగా అర్హత ప్రమాణాలు, నిబంధనలను మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. ఓ కేసుకు సంబంధించి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice Dy Chandrachud) నేతృత్వంలోని జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నియామక ప్రక్రియ ప్రారంభానికి ముందే నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత వాటిని ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. నియామకాలకు ముందే ‘ఆట నియమాలు’ గురించి చెప్పి మధ్యలో మార్చడం సబబు కాదని పేర్కొంది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కచ్చితంగా పారదర్శంగా, నిష్పక్షపాతంగా ఉండాలని బెంచ్ పేర్కొంది. 2008లో కే.మంజుశ్రీ తదితరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) కేసులో రిక్రూట్‌మెంట్ ప్రక్రియల నియమాలను మధ్యలోనే మార్చలేమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయస్థానం సరైనదేనని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.

Advertisement

Next Story

Most Viewed