సీఎంపై ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్

by Satheesh |
సీఎంపై ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నంపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. జన్ సూరజ్ పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. మరోసారి సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లను టార్గెట్ చేశారు. నితీష్ కుమార్ పరిస్థితి గతంలో ఏపీ సీఎం చద్రబాబులా ఉందని ఎద్దేవా చేశారు.

2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు ఇలాంటి ప్రయతమే చేశారని అభిప్రాయపడ్డారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీష్, తేజస్వి ప్రయత్నిస్తున్న తరుణంలో పీకే చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బీహార్‌లో పాలన కుంటుపడిందని, ఇక్కడి పరిపాలనను గాలికి వదిలేసి దేశ రాజకీయాల కోసం వెళ్తున్న నితీష్ కుమార్ గతంలో చంద్రబాబు తరహా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

2019లో చంద్రబాబు సైతం ఇదే మాదిరిగా విపక్షాలను ఏకం చేయాలని చూస్తే ఏం జరిగిందో తెలుసన్నారు. తేజస్వి యాదవ్ లాలూ యాదవ్ కొడుకు కాకపోతే అతని యోగ్యత ఏంటని ప్రశ్నించారు. నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల పేరుతో రాష్ట్రాన్ని వీడుతుంటే పీఎం మోడీ బీహార్‌ను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు నితీష్ కుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మమత, అఖిలేష్ యాదవ్ఋలతో నిన్న నితీష్ కుమార్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story