- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Election: జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం వివరాలు ఇవే
దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల సంఘం శుక్రవారం హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. హర్యానాలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుండగా, జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గాను సెప్టెంబర్ 18న -24 స్థానాలకు, 25న-26 స్థానాలకు, అక్టోబర్ 1న-40 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే హర్యానాలో మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1 న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ రెండింటి ఫలితాలను అక్టోబర్ 4న ఒకేసారి వెల్లడిస్తారు.
ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం, జమ్మూకశ్మీర్‌లో 87.09 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 మంది మహిళలు ఉన్నారు. తొలిసారి ఓటర్ల సంఖ్య 3.71 లక్షలు. ఓటర్ల కోసం 11,800 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సగటు ఓటర్ల సంఖ్య 735గా ఉంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్‌కు, తొమ్మిది షెడ్యూల్డ్ తెగలకు, ఏడు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి.
హర్యానాలో 2.01 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.06 కోట్ల మంది పురుషులు, 0.95 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొదటి సారి ఓటర్ల సంఖ్య 4.52 లక్షలు. యువ ఓటర్లు 40.95 లక్షలు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 20,629. వీటిలో పట్టణ ప్రాంతంలో 7,132, గ్రామీణంలో 13,497 ఉన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 జనరల్, 17 షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కి రిజర్వ్ చేయబడ్డాయి.