- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naked Parade : పోలీసులు చూస్తుండగానే.. అర్ధనగ్నంగా 8 మంది కార్మికుల ఊరేగింపు
దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశా(Odisha)లోని సుందర్‌గఢ్ పట్టణంలో అమానుషం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఎనిమిది మంది కూలీలను దాదాపు 120 మంది మూకలు అర్ధ నగ్నంగా(Naked Parade) ఊరేగించుకుంటూ పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఒకే వర్గానికి చెందిన వీరందరినీ బంగ్లాదేశ్(Bangladesh)కు చెందిన అక్రమ వలసదారులుగా భావించి ఇలా చేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం రోజు సుందర్‌గఢ్‌లోని మిషన్ రోడ్‌లో ఒక వర్గానికి చెందిన మహిళపై మరో వర్గానికి చెందిన యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో.. స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని సదరు యువకుడికి దేహశుద్ధి చేశారు. సదరు యువకుడితో పాటు స్థానికంగా నిర్మాణరంగ కూలీలుగా పనిచేస్తున్న మరో ఏడుగురిపైనా దాడి చేశారు.
దాదాపు 120 మంది మూకలు ఈ ఎనిమిది మందిని నగ్నంగా ఈడ్చుకుంటూ పోలీసు స్టేషనుకు బయలుదేరారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సర్దిచెప్పినా మూకలు వినిపించుకోలేదు. చివరకు అర్ధనగ్న స్థితిలో తాళ్లతో చేతులను కట్టేసి ఎనిమిది మంది బెంగాల్ కార్మికులను పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారగా పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. కార్మికులను అర్ధనగ్నంగా ఊరేగించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదు.
Read More..
RG Kar Rape Case : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. ఆ ఇద్దరికి బెయిల్స్