ఎన్డీఏను విస్తరించే యత్నాల్లో బీజేపీ.. రంగంలోకి ఆ ఇద్దరు నేతలు

by Rajesh |   ( Updated:2024-06-06 07:41:27.0  )
ఎన్డీఏను విస్తరించే యత్నాల్లో బీజేపీ.. రంగంలోకి ఆ ఇద్దరు నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడిన ఎంపీ ఫలితాల్లో మాత్రం బీజేపీ 240 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. అబ్ కీ బార్ 400 పార్ అని ముందు నుంచి చెప్పినా అది వర్క్ అవుట్ కాలేదు. అయితే ఎన్డీఏ కూటమి మాత్రం ఈ సారి విజయం సాధించడంతో మూడో సారి ప్రధానిగా మోడీ అధికారం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏను మరింత విస్తరించడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్రపక్షాలతో పాటు తటస్థ పార్టీలతోనూ సంప్రదింపులు జరపనుంది. కాగా, చర్చల బాధ్యతలను అమిత్ షా, రాజ్ నాథ్‌కు బీజేపీ హైకమాండ్ అప్పగించింది. అపర చాణక్యుడిగా పేరు ఉన్న అమిత్ షా ఎన్డీఏలోకి ఎంత మందిని లాగుతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ ఎంపీలు భేటీ కానున్నారు. ఇందుకు గాను బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీ చేరుకుంటున్నారు.

Advertisement

Next Story