- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో : బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 (ఫెమా) ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. ఫెమా నిబంధనల ప్రకారం.. కొంతమంది బీబీసీ అధికారుల నుంచి పత్రాలు, స్టేట్‌మెంట్‌ల రికార్డింగ్‌ను కూడా ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీని కొద్ది నెలల క్రితం ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ బీబీసీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు నిర్వహించిన ఆ తనిఖీలను ‘సోదాలు కాదు.. సర్వే’అని అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది.