మరోసారి లాలూ, తేజస్వి యాదవ్‌లకు ఈడీ సమన్లు

by S Gopi |
మరోసారి లాలూ, తేజస్వి యాదవ్‌లకు ఈడీ సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైల్వే భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు పాట్నా కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ తాజా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. భూములు తీసుకుని బదులుగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలతో తండ్రీ కొడుకులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారించనుంది. ఈ నెల 29న లాలూ ప్రసాద్ యాద, జనవరి 30న తేజస్వీ యాదవ్‌లు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ బీహార్ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో ఈడీ అధికారుల బృందం సమన్లను అందజేశారు. ఇదే కేసుకు సంబంధించి వీరిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసేందుకు 2023, డిసెంబర్‌లోనూ ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ వారు హాజరు కాలేదు. ఈ కుంభకోణం యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్టు ఆరోపణలున్నాయి.

Advertisement

Next Story