మోడీ, రాహుల్ కు ఈసీ షాక్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు

by Prasad Jukanti |
మోడీ, రాహుల్ కు  ఈసీ షాక్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. మోడీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మోడీ, రాహుల్ పై ఈసీకి ఫిర్యాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు నోటీసులు జారీ చేసింది. అభ్యర్థులు ఎన్నికల కోడ్ పాటించేలా చూసే బాధ్యత పార్టీ అధ్యక్షులదే అని ఈసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story