- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజకీయ పార్టీలకు భారీ షాక్ ఇచ్చిన ఈసీ.. కారణం ఇదే..
దిశ డైనమిక్ బ్యూరో: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు స్వలాభం కోసం చిన్న పిల్లలలను పార్టీ ప్రచారాల్లో వాడుకుంటున్నారు. అయితే ఇక పై ఆలా చేయడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికలకు సంబంధించిన పనులు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చిన్న పిల్లలను చేర్చకుండా చూడాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక సర్క్యూలర్ ను ఈసిఐ విడుదల చేసింది.
ఇక పై ఈసిఐ ఆదేశించిన తీరుగా ఎన్నికల అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని.. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రాజకీయ ప్రచారాల్లో, ఎన్నికల ర్యాలీలలో పిల్లలను ఏ రూపంలో కూడా ఉపయోగించకూడదని కమిషన్ హెచ్చరికలు జారీచేసింది. కాగా పోస్టర్లు/కరపత్రాల పంపిణీ, నినాదాలు, ప్రచార ర్యాలీలు, ఎన్నికల సమావేశాల్లో పాల్గొనడంవాటిలో ఏ రూపంలోనూ పిల్లలను ఉపయోగించవద్దని ఈసిఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పిల్లల వాడకం పట్ల 'జీరో టాలరెన్స్' అనే సందేశాన్ని ఇస్తూ ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.
.