- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సబ్సు పెట్టెల్లో రూ.37కోట్ల విలువైన డ్రగ్స్..అసోంలో పట్టివేత
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని శివసాగర్ జిల్లాలో సబ్సు పెట్టెల్లో తీసుకెళ్తున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున నాగాలాండ్ నుంచి వస్తున్న ఓ ట్రక్కును శివసాగర్ జిల్లా పోలీసులు అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని తనిఖీ చేయగా..4.6 కిలోల బరువున్న హెరాయిన్‌తో కూడిన 399 సబ్సు బాక్సులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.37 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, గతంలోనూ అసోంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story